కొనసాగుతూన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల బాదుడు…

పెట్రోల్‌, డీజిల్‌ ధరల బాదుడు కొనసాగుతూనే ఉంది.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర ఇప్పటికే రూ.105ను క్రాస్‌ చేయగా.. డీజిల్‌ ధర రూ.94ను దాటేసింది… చమురు సంస్థలు ఇవాళ మరోసారి పెట్రో ధరలను పెంచాయి.. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు పెరగగా.. డీజిల్ ధర కూడా 35 పైజలు పెరిగింది.. దీంతో హస్తినలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.49కు చేరగా.. డీజిల్‌ ధర రూ. 94.22కు ఎగిసింది.. ఇక, ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 111.43కు
పెరిగితే.. డీజిల్‌ ధర రూ.102.15కు చేరింది. మరోవైపు కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.106.11కి, లీటర్‌ డీజిల్‌ ధర రూ.97.33కి.. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.102.70, డీజిల్‌ ధర రూ.98.59గా ఉంది.. ఇక, లీట‌ర్ పెట్రోల్‌పై 36 పైస‌లు, డీజిల్‌పై 38 పైస‌లు పెరగడంతో.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర రూ. 109.73 కాగా, డీజిల్ ధ‌ర రూ. 102.80కు ఎగిసింది.. ఇది సామాన్యులకు మోయలేని భారంగా మారుతుండగా.. క్రమంగా నిత్యావసరాలు, ఇతరములపై కూడా ప్రభావం పడుతోందనే ఆందోళన నెలకొంది.