నాలుగో రోజు పెరిగిన పెట్రోల్ ధ‌ర‌లు..

మ‌రోసారి పెట్రో పిడుగు ప‌డింది. పెట్రోల్ ధ‌ర‌లు భ‌గ‌భ‌గ‌మంటున్నాయి. వ‌రుస‌గా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. లీట‌ర్ పెట్రోల్‌పై 89 పైస‌లు, డీజిల్‌పై 86 పైస‌లు పెంచుతూ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. పెరిగిన పెట్రోల్ ధ‌ర‌ల‌తో హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 111.80కి చేరింది. డీజిల్ ధ‌ర రూ. 98.10గా ఉంది. ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 98.61 కాగా, డీజిల్ ధ‌ర రూ. 89.87, ముంబైలో పెట్రోల్ ధ‌ర రూ. 113.35 కాగా, డీజిల్ ధ‌ర రూ. 97.55గా ఉంది…మరో‌వైపు, పెట్రో ధరల పెంపును నిర‌సిస్తూ విపక్ష ఎంపీలు శుక్ర‌వారం లోక్‌‌స‌భలో పెద్ద‌యె‌త్తున నిర‌స‌నలు వ్యక్తం చేశారు. ఎన్ని‌కలు ముగి‌య‌గానే కేంద్రం పెట్రో‌బా‌దు‌డుకు దిగిం‌దని మండి‌ప‌డ్డారు. అనం‌తరం లోక్‌‌సభ నుంచి వాకౌట్‌ చేశారు.