తాజాగా లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంపు…

మార్చి 22 నుంచి కొనసాగుతున్న ధరల పెరుగుదల తొమ్మిదోరోజూ కొనసాగింది. ప్రతిరోజూ పెట్రోల్‌, డీజిల్‌పై సుమారు రూపాయి మేర పెంచుతూ వస్తున్నాయి. తాజాగా లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.115.42, డీజిల్‌ రూ.101.58కి చేరాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోని పెట్రోల్‌ రూ.117.32,డీజిల్‌ రూ.103.10గా ఉన్నాయి…దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలో, డీజిల్‌పై 80 పైసల చొప్పున పెరగడంతో రూ.101.81, రూ.93.07కు చేరాయి. ముంబైలో పెట్రోల్‌ రూ.116.72, డీజిల్‌ రూ.100.94 (84 పైసలు), చెన్నైలో పెట్రోల్‌ రూ.107.45, డీజిల్‌ రూ.97.52 (76 పైసలు), కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.111.35 (83 పైసలు), డీజిల్‌ రూ.96.22 (80 పైసలు)కు పెరిగాయి…