మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి..

మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ చొప్పున 40 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ ధర రూ. 103.41కు చేరగా.. డీజిల్ ధర రూ. 95.07గా ఉంది. గడిచిన 14 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు 12 సార్లు పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్ పై రూ. 8.40 మేర భారం పడింది…

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ పై 45 పైసల పెంపుతో ధర రూ. 117.68 చేరుకోగా.. లీటర్ డీజిల్ ధర రూ. 103.75కు ఎగబాకింది. మరోవైపు గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర 44 పైసలు పెరిగిన నేపథ్యంలో దీని ధర రూ. 119.51కు చేరింది. డీజిల్ ధర 41 పైసలు పెరిగి రూ. 105.2 వద్ద ఉంది…
గుంటూరులో పెట్రోల్ ధర 44 పైసలు ఎగబాకి.. రూ.119.51కు చేరింది. డీజిల్ ధర రూ.41 పైసలు పెరిగి.. రూ.105.2కు చేరుకుంది.

వైజాగ్​లో 44 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర రూ.118.23కు ఎగబాకింది. డీజిల్ ధర 41 పైసలు అధికమై.. రూ.103.95కు చేరింది…

దేశవ్యాప్తంగా ఇంధన ధరలను చమురు సంస్థలు మరోసారి పెంచాయి.

దిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరను 40 పైసల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించాయి.

తాజా నిర్ణయంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.41కు చేరుకుంది.

డీజిల్ ధర రూ.95.07కు ఎగబాకింది. కాగా, 14 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది 12వ సారి.

మొత్తంగా ఇప్పటివరకు లీటర్ పెట్రోల్ ధర రూ.8.40 మేర పెరిగింది.

ముంబయిలో పెట్రోల్ ధర 42 పైసలు పెరిగి.. రూ.118.81కు ఎగబాకింది. డీజిల్ ధర 43 పైసలు అధికమై.. రూ.103.05కు చేరుకుంది.

38 పైసల పెరుగుదలతో చెన్నైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.109.32కు చేరుకోగా.. డీజిల్ ధర 38 పైసలు పెరిగి రూ.99.4కు ఎగబాకింది.

కోల్​కతాలో లీటర్ పెట్రోల్​పై 42 పైసలు, డీజిల్​పై 41పైసలు పెరిగింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.113.43గా ఉంది. డీజిల్ ధర రూ.98.21కి చేరింది…