పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు ఉత్తి ప్రచారమే : పెట్రోలియం శాఖ మంత్రి..

సార్వత్రిక ఎన్నికల ముందు చమురు ధరలను కేంద్రం తగ్గిస్తుందంటూ వస్తున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. చమురు ధరల తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం అనేది పూర్తిగా ఊహాజనితమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ పేర్కొన్నారు..చమురు ధరల తగ్గింపుపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఎలాంటి చర్చలూ జరగలేదని బుధవారం విలేకరుల సమావేశంలో స్పష్టతనిచ్చారు. ఓ వైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, మరోవైపు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తుందంటూ వార్తలు వచ్చాయి. లీటర్కు రూ.6 మేర తగ్గే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఒకప్పటితో పోలిస్తే చమురు ధరలు గరిష్ఠాల నుంచి భారీగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆ మేర వినియోగదారులకు ప్రయోజనాన్ని బదిలీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందంటూ వార్తలు వచ్చాయి. అయితే, అలాంటిదేమీ లేదంటూ ప్రచారానికి పురీ చెక్ పెట్టారు..