పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి..

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. వరుస వడ్డింపునకు శుక్రవారం విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు శనివారం నుంచి ప్రజలపై మళ్లీ భారం మోపుతున్నాయి. దీంతో మార్చి 22 నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం ఇది పదకొండో సారి.
తాజాగా లీటరు పెట్రోల్‌పై 92 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున బాదాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర 117.25కు చేరగా, డీజిల్‌ ధర రూ.103.32కు పెరిగింది. మొత్తంగా పదకొండు రోజుల్లో లీటరుపై సుమారు రూ.9 వరకు చమురు ధరలు పెరిగాయి.