పెట్రోల్పై లీటరుకు రూ.13 నుండి రూ.3కి, డీజిల్పై రూ.10గా ఉన్న సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం
దీని వల్ల వినియోగదారులకు ధరలు తగ్గే అవకాశం లేదు
అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరల వల్ల నష్టాల్లో ఉన్న ఆయిల్ కంపెనీలకు ఉపశమనం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
ఆయిల్ కంపెనీలపై ఒత్తిడి తగ్గిస్తూ రిటైల్ ధరలు పెంచే అవసరాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ వినియోగదారులకు వెంటనే ఉపశమనం లభించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి దాదాపు మూతబడటంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీని.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ నష్టాన్ని తగ్గించుకోవడానికి వినియోగించే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరకపోయినప్పటికీ.. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా ఈ నిర్ణయం కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది..
కారణమిదే..
అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతుండటం, ఇంధన ధరల పెంపుపై ఆందోళనలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. భారతదేశానికి దిగుమతి అయ్యే 90 శాతం ముడి చమురును రవాణా చేసేందుకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పూర్తిస్థాయి దిగ్బంధనాన్ని విధించింది. ఇది ప్రపంచ ఇంధన మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ యుద్ధం వల్ల సౌదీ అరేబియాలోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీని లక్ష్యంగా చేసుకుని, కీలకమైన ముడి చమురు మౌలిక సదుపాయాలపై ఇరాన్ బాంబు దాడులు, క్షిపణి దాడులు చేసింది. దీంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది..