పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గురువారం మళ్లీ పెరిగాయి…

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గురువారం మళ్లీ పెరిగాయి.

తాజాగా లీటర్‌కు 25 నుంచి 30 పైసల వరకు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.87.85కి చేరుకుంది. అలాగే డీజిల్‌ లీటర్‌కు రూ.78.03కు పెరిగింది. ఇప్పటికే ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో గురువారం లీటర్ పెట్రోల్ ధర 26 పైసలు పెరిగి రూ.91.35కి చేరుకుంది. డీజిల్ ధర రూ.85.11గా ఉంది. వాణిజ్యరాజధాని ముంబైలో పెట్రోల్ ధర గరిష్టస్థాయిని తాకింది. పెట్రోల్ ధర ఇక్కడ రూ.94.36కు చేరుకుంది. కోల్‌కతాలో రూ.89.16, చెన్నైలో రూ.90.19గా ఉంది. డీజిల్ ధర ముంబైలో లీటర్‌కు రూ.84.94, కోల్‌కతాలో రూ.81.61, చెన్నైలో రూ.83.16కు చేరుకుంది. జైపూర్‌లో పెట్రోల్ రూ.94.25, డీజిల్ రూ.86.27కు చేరింది. తాజా పెంపుతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పెట్రోల్‌ డీజిల్‌పై సుమారు రూ.4 వరకు పెరిగింది..