HPCL ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల సమ్మె బాట……!

*సూర్యాపేట జిల్లా :…….

సూర్యాపేట లో HPCL ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల సమ్మె బాట….

పార్లమెంటులో ప్రవేశపెట్టిన నూతన భారతీయ న్యాయ సంహిత 2023 మోటారు వాహనాల హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగిన డ్రైవర్లు….

చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్….

కేంద్రం తెచ్చిన నూతన చట్టం తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని కార్మికుల ఆవేదన…

కేంద్రం వైఖరిని నిరసిస్తూ… ట్యాంకర్లను నిలిపివేసి ఆందోళన…..

కార్మికుల సమ్మెతో నిలిచిన ఇంధన సరఫరా….

ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన నూతన భారతీయ న్యాయ సంహిత 2023 , మోటార్ వాహనాల హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సమ్మె పిలుపు మేరకు సూర్యాపేట హెచ్ పీ సీ ఎల్ పెట్రోలియం టెర్మినల్ వద్ద టాంకర్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు , నూతన చట్టానికి వ్యతిరేకంగా ట్యాంకర్లను నిలిపివేసి ధర్నాకు దిగారు . ట్యాంకర్ డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో సూర్యాపేట హెచ్ పీ సీ ఎల్ టెర్మినల్ నుండి ఉమ్మడి నల్లగొండ , ఖమ్మం , వరంగల్ , కరీంనగర్ జిల్లాల పరిధిలోని పెట్రోల్ బంకులకు పెట్రోల్ , డీజిల్ సరఫరా చేయాల్సిన 200 ట్యాంకర్లు నిలిచిపోయాయి . పాత మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రమాదంలొ ట్రక్కు డ్రైవర్ కారణంగా ఎవరైనా మృతి చెందితే 304 a సెక్షన్ కింద 2 సంవత్సరాల వరకు శిక్ష పడేదని నూతన చట్టం ప్రకారం ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్లకు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 7.5 లక్షల రూపాయల వరకు జరిమానా విధింపు ఉంటుందని ఈ చట్టం ట్రక్కు డ్రైవర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని ఏ డ్రైవర్ కావాలని చంపేందుకు ట్రక్కుతో రోడ్డు మీదకు రారని ఇలాంటి నల్ల చట్టాలని తక్షణమే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు . ట్యాంకర్ డ్రైవర్ల సమ్మె నేపథ్యంలో ఇప్పటికే కొన్ని పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టారు , నూతన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని డ్రైవర్లు అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో సమ్మె ఉధృతమైతే నిత్యావసర వస్తువుల రవాణా పై ప్రభావం పడే అవకాశం ఉంది …