ఫ్రీ వెడ్డింగ్ ఘాట్ కోసం వెళ్తే ప్రాణాల మీదకు వచ్చింది..

ఫ్రీ వెడ్డింగ్ ఘాట్ వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు

ఫ్రీ వెడ్డింగ్‌ షూట్‌ ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఏడడుగుల బంధాన్ని మధుర జ్ఞపకాలుగా మిగిల్చుకునేందుకు ఆ కాబోయే జంట చేపట్టిన ఫ్రీ వెడ్డింగ్‌ వారి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది.ఈ విషాదకర సంఘటన వారి జీవితాల్లో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని అబ్దుల్లా పూర్‌మెట్ మండలం కొహెడ గ్రామంలో ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లో విషాదం నెలకొంది.ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్న సమయంలో షూట్‌ ఎఫెక్టివగ్‌ ఉండటం కోసం పొగ పెటడంతోపెళ్లికొడుకు, పెళ్లికూతురుపై తేనెటీగలు దాడి చేశాయి. కాగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులు హైదరాబాద్‌లోని మాలక్‌పేట యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.మరో రెండు రోజుల్లో పెండ్లి బాజా భజంత్రీలతో సందడిగా మారాల్సిన ఆ ఇండ్లలో ఇప్పుడు ఇలా జరగడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.