టీచర్, స్టూడెంట్ ఫొటోషూట్‌ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్..

కర్నాటకలోని చింతామణి తాలూకాలోని మురుగమల్లా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్టడీ టూర్‌లో ఉన్న విద్యార్థితో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఆమెను ఏకిపారేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Photoshoot Of Karnataka Teacher And Student Goes Viral, Internet …
ప్రేమికులు, భార్యాభర్తలు ఫొటోషూట్లలో పాల్గొనడం చూశాం. ఆ జంటలు రొమాంటిక్‌గా ఫొటోలు దిగుతూ తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకుంటుంటారు…కానీ ఓ టీచర్ తన స్టూడెంట్‌తో ఫొటోషూట్ చేసి, అందరి దృష్టిని ఆకర్షించారు. అదేదో మామూలుగా ఫొటోలకు ఫోజులివ్వలేదు. ప్రేమికుల మాదిరిగానే ప్రేమలో మునిగిపోయారు. ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయారు. ఆ ఫొటో షూట్ అంతా రొమాంటిక్‌గా సాగిపోయింది.

స్టూడెంట్ ఏమో ఎల్లో కలర్ షేర్వానీ ధరించాడు. టీచరేమో పింక్ కలర్ చీర ధరించి మెరిసిపోయారు. ఇక ఇద్దరూ కలిసి పచ్చని చెట్ల మధ్య ఫొటోషూట్ చేశారు. ఆ విద్యార్థి టీచర్ కొంగును లాగుతూ ఉండగా, ఆమెనేమో సిగ్గు ఒలకబోస్తూ తన చేతిలో ఉన్న గులాబీ పువ్వుతో తన ప్రేమను వ్యక్తపరిచినట్లుంది. అక్కడితో ఆగిపోలేదు.. ఆ విద్యార్థి టీచర్‌కు ముద్దు పెట్టి తన ప్రేమను పంచాడు. ఈ ఫొటోషూట్ మరింత రొమాంటిక్ సీన్‌లోకి వెళ్లిపోయింది. ఏకంగా సదరు విద్యార్థి టీచర్‌ను ఎత్తుకుని, ప్రేమలో ముంచెత్తాడు. టీచర్ కూడా ఆ పిల్లాడికి ముద్దులు పెడుతూ, ఇద్దరూ కౌగిలింతలతో తన్మయత్వం చెందారు. టీచర్, స్టూడెంట్ ఫొటోషూట్‌కు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లపూర్ జిల్లాలో వెలుగు చూసింది.

అయితే ఈ షూట్‌లో పాల్గొన్న మహిళా టీచర్.. మురుగమళ్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తోంది. స్టూడెంటేమో అదే స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. స్టడీ టూర్‌కు వెళ్లిన సందర్భంగా ఈ ఫొటోషూట్ జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. టీచర్ ప్రవర్తనపై విచారణ జరిపించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ అధికారి వీ ఉమాదేవి పాఠశాలను సందర్శించి, విచారణ చేపట్టారు.