పిడుగు పడి జేబులోనే పేలిన సెల్‌ఫోన్.

పిడుగు పడి జేబులోనే పేలిన సెల్‌ఫోన్.. యువకుడి దుర్మరణం..

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జోగుంపేటలో సోమవారం ఘటన.

సాయంత్రం తమ స్వగ్రామానికి బయలుదేరిన ఇద్దరు యువకులు.

పిడుగుపడటంతో ఓ వ్యక్తి జేబులోని ఫోన్ పేలి దుర్మరణం మరో యువకుడికి గాయాలు, అతడికి తప్పిన ప్రాణాపాయం..

పిడుగుపడటంతో జేబులోని సెల్‌ఫోన్ పేలి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం సూదవరపు జయంత్(23), మరో యువకుడితో కలిసి పాతమల్లం పేట నుంచి స్వగ్రామం వస్తుండగా జోగుంపేటలో పిడుగు పడి జయంత్ జేబులోని ఫోన్ పేలింది. దీంతో అతడు మృతి చెందాడు. అతడితో పాటూ వస్తున్న యువకుడికి గాయాలయ్యాయి. అతడికి ప్రాణాపాయం తప్పింది…!!_