పిరమిడ్‌ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ ఇకలేరు.

పిరమిడ్‌ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ ఇకలేరు

: ప్రముఖ పిరమిడ్‌ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ (74) కన్నుమూశారు. గత కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవల బెంగళూరులో చికిత్స తీసుకున్నారు. రెండు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో ఆయన్ను కడ్తాల్‌లోని మహేశ్వర మహా పిరమిడ్‌ ధ్యాన కేంద్రానికి తరలించారు. ఆదివారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం 5గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు పిరమిడ్‌ ధ్యాన్‌ ట్రస్టు సభ్యులు తెలిపారు.