గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ నుంచి సరికొత్త 7a సిరీస్ రాబోతోంది. ..

అమెరికాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అయిన గూగుల్, తమ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధం అవుతుంది…

గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ నుంచి సరికొత్త 7a సిరీస్ రాబోతోంది. అధికారికంగా మే 10న (Google IO 2023) ఈవెంట్‌లో పిక్సెల్ 7a ఫోన్ లాంచ్ కావాల్సి ఉంది. అయితే, లాంచ్ కావడానికి కొన్ని రోజుల ముందే ఈ ఫోన్ ధర వివరాలు లీకయ్యాయి. (MySmartPrice) ప్రకారం.. సింగపూర్ ఆధారిత ఇ-రిటైలర్‌లో Pixel 7a ధర (SGD 749)గా ఉంది. అంటే.. భారత కరెన్సీలో దాదాపుగా రూ. 46,000 వరకు ఉండొచ్చు. ఆసక్తికరంగా, 2022 పిక్సెల్ 6a సింగపూర్‌లో ఒకే 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌ అదే ధరతో లాంచ్ అయింది…

వివిధ వెబ్ సైట్స్ లో అందుబాటులో ఉన్న గూగుల్ పిక్సెల్ 7ఏ స్పెసిఫికేషన్స్ ను ఒకసారి పరిశీలిస్తే..
* 6.1 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ ప్లే
* 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
* 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్
* కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
* అల్వేస్ ఆన్ డిస్ ప్లే
* ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం
* గూగుల్ టెన్సర్ జీ2 చిప్ సెట్