ఒంటరి పోరో.. లేక, కూటమితో వస్తానో ఇంకా నిర్ణయించలేదు : పవన్‌

*అన్నవరం జనసేన కథ ఏంటో తొందరలోనే తేలిపోతుందా? పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు విన్నతర్వాత అందరికీ ఇలాగే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే తొందరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోతోందని చెప్పారు..

ఇంతవరకు బాగానే ఉందికానీ ఎన్నికల్లో జనసేన ఎవరితోనూ పొత్తు పెట్టుకోవటంలేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికలను ఒంటరిగానే ఎదుర్కొని పార్టీ సత్తా ఏమిటో చూపిస్తుందని చెప్పారు. ఈ మాటతోనే అందరికీ అనుమానం పెరిగిపోతోంది.
“ఎంతసేపూ… నువ్వు విడిగా రా… నువ్వు విడిగా రా అంటారు. నేను విడిగా వస్తానో, ఉమ్మడిగా వస్తానో ఇంకా నిర్ణయించుకోలేదు. ఆ సమయం వచ్చినప్పుడు కుండబద్దలు కొట్టినట్టు చెబుతాను. కానీ ఒక్క విషయం… వచ్చే ఎన్నికల్లో గెలిచి నేను అసెంబ్లీలో అడుగుపెట్టాల్సిందే… పెడతాను. దాన్ని కోసం ఎన్ని వ్యూహాలైనా అనుసరిస్తాం. ముఖ్యమంత్రి పదవిని ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాం. ముఖ్యమంత్రి పదవి మనకు రావాలంటే ఏం చేయాలి, ఎలా వెళ్లాలి అనేది మాట్లాడుకుందాం” అంటూ పవన్ తన మనసులో మాట చెప్పారు..