మొదటి సర్వే నివేదికను సీఎం కేసీఆర్ కు అప్పగించిన పీకే టీం…!!!

చిత్రగుప్తుడు చిట్టాల ఎమ్మెల్యేల మంత్రుల జాతకాలు సర్వే నివేదిక లో ఉన్నట్లు సమాచారం...

Pk టైమ్ 119 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో సర్వే నిర్వహిస్తుంది..!!!

మొదటి సర్వే నివేదికను సీఎం కేసీఆర్ కు అప్పగించిన పీకే టీం..

రెండో దఫా సర్వే నివేదిక కుడా రెడీ అవుతుంది..

చిత్రగుప్తుడు చిట్టాల ఎమ్మెల్యేల మంత్రుల జాతకాలు సర్వే నివేదిక లో ఉన్నట్లు సమాచారం...

సీఎం కేసీఆర్ కూడా మరో సొంత సర్వే...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు రెండు దఫాలుగా అధికారంలో కొనసాగుతున్న టిఆర్ఎస్ పార్టీ మరోమారు అధికారాన్ని చేజిక్కించుకోవడం వ్యూహంగా పావులు కదుపుతోంది…..

అయితే గతం కంటే ప్రస్తుతం కొద్దిగా టిఆర్ఎస్ పార్టీ ఇబ్బందుల్లో ఉందని సంకేతాలు గులాబీ శ్రేణుల్లో బలంగా వినబడుతుంది..
ఇక ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల పైన కూడా దృష్టి సారించడం ప్రధానంగా కనిపిస్తుంది. గత రెండు దఫాల ఎన్నికలలో విజయం సాధించిన టిఆర్ఎస్ పార్టీ, ఈ సారి జాతీయ రాజకీయాలలో కూడా కీలకంగా మారాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ ను రంగంలోకి దింపింది…

గులాబీ ఎమ్మెల్యే, మంత్రులకు లో గుబులు తెప్పిస్తుంది…!!!

మొదటి నివేదికలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రుల భూదందాలు అక్రమ వ్యాపారాలు పై నివేదిక వెల్లడించినట్లుగా ప్రచారం..!

తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ 22 రకాల సర్వేలను నిర్వహిస్తున్నట్లు ప్రచారం!!.
ఈ సర్వేలలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయం, నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు, ఎంపీల పనితీరు, రైతులు, కులాల వారీగా ప్రజల సమస్యలు, వారి ఓట్ల ప్రభావం, తదితర అంశాలపై పీకే టీం సర్వే నిర్వహిస్తుంది.. ప్రశాంత్ కిషోర్ టీమ్ నిర్వహిస్తున్న సర్వేలో టిఆర్ఎస్ పార్టీ వైఖరిపై ఉద్యమకారులు తీవ్ర అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తుంది..!

ముఖ్యంగా ఉద్యమకారులలో మొదలైన వ్యతిరేకత..

2014లో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఉద్యమకారులకు పట్టం కడుతుంది అని భావిస్తే, అందుకు భిన్నంగా తెలంగాణ ఉద్యమకారులను పక్కనపెట్టి ఇతర పార్టీల నుండి వలస వచ్చిన వారికి కీలక పదవులను ఇచ్చి పట్టం కట్టడాన్ని ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కెసిఆర్ ఆదేశాలతో ఉద్యమ సమయంలో డబ్బు ఖర్చుపెట్టి, పోరాటం చేసిన వారికి ఎలాంటి ప్రాధాన్యత ప్రస్తుతం లేదని, గతంలో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడిన వారంతా ఇప్పుడు పదవులను అనుభవిస్తున్నారని మండిపడుతున్నారు.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిజమైన ఉద్యమకారులకు గౌరవం దక్కడం లేదంటూ తీవ్ర ఆవేదన లో ఉన్నట్లుగా తెలుస్తోంది.. నామినేటెడ్ పోస్టులు దొరుకుతాయేమో అని ఆశించి భంగపడ్డ ఉద్యమకారులు..

జిల్లాలు,నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు…!!

పార్టీలో జిల్లాల వారీగా గ్రూప్ తగాదాలు ఉన్నట్టుగా సర్వే టీం పేర్కొన్నట్టు సమాచారం… ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో పార్టీ దెబ్బతినే అవకాశం లేకపోలేదని ప్రశాంత్ కిషోర్ టీం తమ సర్వే నివేదిక ద్వారా తేల్చి చెబుతోంది. మరి ఇలాంటి పరిస్థితులలో టిఆర్ఎస్ పార్టీ ప్రజల మద్దతును కూడగట్టడానికి సీఎం కేసీఆర్ పార్టీ పై ఎక్కువ అ దృష్టిసారించాలని సలహా ఇచ్చినట్లు సమాచారం… ఉద్యమకారుల వ్యతిరేకతను ఏమేరకు తగ్గించగలుగుతుంది? అనే ఆలోచనలలో గులాబీ బాస్ వ్యూహాలు రక్షించాలని పీకే సర్వే నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది..

సుమారు 20 నుండి 25 స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థుల పని తీరుపై అసంతృప్తి….టికెట్ కేటాయింపు కూడా కష్టమే అంటూ ప్రచారం...

సీఎం కేసీఆర్ మధ్యలో ప్రస్తుతం మెదులుతున్న ఆలోచన కూడా ఇదే… పీకే టీం ఇచ్చిన నివేదికలో పలువురు భూదందాలు.. ల్యాండ్ సెటిల్మెంట్లు.. అక్రమ రవాణా లు.. అవినీతికి కొమ్ముకాస్తు పార్టీని ఆగం చేస్తున్నట్లుగా సర్వేలో నివేదిక ఇచ్చినట్లు సోషల్ మీడియాలో టీఆర్ఎస్ శ్రేణుల్లో జోరుగా నడుస్తున్న ప్రచారం….
ఈ ప్రచారంతో 20 నుండి 25 స్థానిక ఎమ్మెల్యే సిట్టింగ్ స్థానాలు కొత్తవారికి కేటాయించనున్నట్లు గా టిఆర్ఎస్ శ్రేణులు జోరుగా ప్రచారం జరుగుతోంది….దీంతో గులాబీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి… తమ సీటింగ్ స్థానాలు ఎక్కడ పోయి కొత్తవారు వస్తారు అనే భయంతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు…. తమ పేరు ఎక్కడుందో అనుకుంటూ మరికొందరిలో టెన్షన్ మొదలంది….. మొత్తానికి పీకే టీం చేసిన సర్వేలో టిఆర్ఎస్ పార్టీకి కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అనే ప్రచారాన్ని ప్రతిపక్షాలు బలంగా వినిపిస్తున్నాయి…

సీఎం కేసీఆర్ కూడా సంస్థ సర్వే చేస్తున్నట్లు ప్రచారం..!!

పీకే సర్వే చేస్తున్న సంగతి దాదాపు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తెలుసు.. అలానే ఇందులో నిజమెంతో అబద్ధమెంతో అనే ఒక చిన్న సందేహం తో తాను కూడా ఓ సొంత సర్వే చేయించాలనే ఆలోచనతో కొత్త టీమ్ ని రంగంలోకి దింపినట్లు గా ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ…

ఎక్కడ ఎక్కడ ఎమ్మెల్యేలకు ప్రజాదరణ ఎలా ఉంది.. ఎమ్మెల్యే గురించి ఏం మాట్లాడుకుంటున్నారు.. సిట్టింగ్ ల పరిస్థితి ఏమిటి,, టికెట్ ఆశిస్తున్న వారి పరిస్థితి వారి ప్రజాభిప్రాయం ఏమిటి.. పికే టీం నివేదిక ఇచ్చిన నియోజకవర్గాల్లోనే ప్రస్తుతం సీఎం కేసీఆర్ టీం తిరుగుతోంది అంటూ ప్రచారం…. ఎవరిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి… ఎవరికి టికెట్ ఇవ్వాలి… అనే అంశంపై గులాబీ బాస్ టీం పని చేస్తున్నట్లు సమాచారం..

ముందస్తు అభ్యర్థుల ప్రకటన కై తీవ్రస్థాయిలో కసరత్తు నిర్వహిస్తున్నారు… బ్లాక్ లిస్టులో ఎవరి పేరు ఉంటుందో అర్థం కాక గులాబీ ఎమ్మెల్యేల్లో గుబులు పుడుతుంది..

నియోజకవర్గాలు పెరుగుతాయి అనే ఆశలు ప్రస్తుతం గల్లంతు కావడంతో కొత్త గుబులు మొదలు.. ఇప్పుడు నియోజకవర్గంలలొ విభజన జరుగుతుంది అప్పుడు టికెట్ వస్తుంది అని ఆశించిన వారికి ప్రస్తుతం నిరాశ ఎదురైంది… వారు ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళాలి ఎటు వైపు టికెట్ వస్తుందా అని ఆలోచన కూడా చేస్తున్నట్టు పీకే సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది..

మొత్తానికి పీకే సర్వే టిఆర్ఎస్ శ్రేణుల్లో కొంత మందికి గుబులు పుట్టిస్తోంది….