అక్టోబర్‌ 1నుంచి దేశంలో 5జీ సేవలు.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ…

భారతదేశంలో అతి త్వరలో 5G సేవలు ప్రారంభం కానున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్‌ 1న 5జీ సేవలను ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరగనున్న ‘‘ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌’’ కార్యక్రమంలో ఈ సేవలకు శ్రీకారం చుట్టునున్నారు. ఈ మేరకు మినిష్ట్రీ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌, నేషనల్‌ బ్రాడ్‌బాండ్‌ మిషన్‌ శనివారం ఓ ట్వీట్‌ చేసింది. ఇక, 5జీ సేవలు తొలి దశలో హైదరాబాద్‌తో సహా 13 నగరాల్లో ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ, గుర్గావ్‌, జామ్‌నగర్‌, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణె, చండీఘర్‌, గాంధీనగర్‌, అహ్మాదాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాల్లో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రానున్న మూడు, నాలుగేళ్లలో చిన్న పట్టణాలకు కూడా 5 జీ సేవలు విస్తరించే అవకాశం ఉంది.