ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్ ఒకటి ముంబైలోని ఎన్‌ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) కార్యాలయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు…ప్రధాని మోదీ హత్యకు 20 మంది స్లీపర్ సెల్స్‌ను తయారు చేశామని, 20 కేజీల ఆర్‌డీఎక్స్‌ను సిద్ధం చేశామని ఆగంతకులు ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ మెయిల్‌ను ధృవీకరించిన ముంబై ఎన్‌ఐఏ కార్యాలయం.. ప్రధాని భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు సమాచారం.ప్రధాని మోదీకి బెదిరింపు ఈ-మెయిల్ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ అప్రమత్తమైంది. అంతే కాకుండా తమకు వచ్చిన ఆ-మెయిల్ ను ఎన్ఐఏ వివిధ మెయిల్ ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు సైబర్ సెక్యూరిటీ విభాగం రంగంలోకి దిగింది. అలాగే ప్రధాని మోదీ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.