నేటి హైదరాబాద్‌ పర్యటనపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌..

R9TELUGUNEWS.COM. నేటి హైదరాబాద్‌ పర్యటనపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. నగరంలో రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకోనున్నారు. పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజాచార్య విరాట్‌ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. తొలుత శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రధానికి సీఎం స్వాగతం పలుకుతారు. ఆయన వెంట హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు, అనంతరం ముచ్చింతల్‌కు వస్తారు. ప్రధాని కార్యక్రమాలన్నింటిలో పాల్గొనడంతో పాటు ఆయన విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వీడ్కోలు పలికే వరకూ ముఖ్యమంత్రి మోదీ వెంటే ఉంటారు.