న్యాయం విషయంలో శివాజీ ఎన్నడు కూడా రాజీపడలేదు..మోడీ

సత్యం, న్యాయం విషయంలో ఎన్నడూ రాజీపడని ధీరుడు ఛత్రపతి శివాజీ: మోడీ.

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. న్యాయం విషయంలో శివాజీ ఎన్నడు కూడా రాజీపడలేదని అన్నారు. ఆయన విశిష్ట నాయకత్వం, సాంఘిక సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యత తరతరాలుగా ప్రజలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. శివాజీ ఆశయాన్ని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.1630లో జన్మించిన శివాజీ.. తన శౌర్యం, సైనిక మేధావి, నాయకత్వానికి గుర్తింపు పొందాడని, ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి సందర్భంగా నమస్కరిస్తున్నానని మోడీ ట్వీట్‌ చేశారు. శివాజీ న్యాయం, సత్యం విలువల కోసం నిలబడే విషయంలో రాజీపడలేదన్నారు.
యావత్‌ భారత జాతి గర్వంగా చెప్పుకొనే ధీరుడు, వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే వీరుడు ఛత్రపతి శివాజీ అని, పుట్టుకతోనే వీరత్వాన్ని పుణికిపుచ్చుకున్న శివాజీ గొప్ప యోధుడన్నారు. మరాఠౄ రాజ్యాన్ని స్థాపించి మొఘల్‌ చక్రవర్తులను ఎదిరించి వారి సామ్రాజ్యాన్ని తన హస్తతం చేసుకున్నారని మోడీ అన్నారు. మొఘలులను గడగడలాడించి ఆనాడే సమానత్వ సాధనకు ఛత్రపతి శివాజీ ఎంతో కృషి చేశారని, హిందుత్వాన్ని అనుసరిస్తూ అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని అన్నారు.