ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం….

ప్రజలకు ప్రధాని మోడీ సందేశం..

ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం ఇచ్చారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా యోగాకు ఉన్న ప్రాధాన్యం గురించి ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. యోగా అంటే కేవలం ఆసనాలే కాదని, శ్వాస వ్యవస్థకు సంబంధించి వ్యాయామం కూడా అని తెలిపారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అంటు వ్యాధులు కానివి (గుండెపోటు, స్ట్రోక్, థైరాయిడ్, మధుమేహం తదితర), జీవన శైలి వ్యాధులు నేడు పెరిగిపోతున్నందున యోగాకు ప్రాధాన్యత పెరిగినట్టు ప్రధాని తెలిపారు. మంచి ఆరోగ్యం కోసం యోగ సాధన చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని, తమ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరారు. యోగాకు సంబంధించి వీడియోను ఈ సందర్భంగా ఆయన షేర్ చేశారు.