ప్రధాని మోదీ ఈ నెల 12న రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి హాజరు..!! ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా లేదా..!!
ప్రధాని మోదీ ఈ నెల 12న రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి హాజరు కానుండగా ఈపర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే అంశంపై సందిగ్ధత నెలకొంది…
రాష్ట్రంలో పరిస్థితులకు తోడు రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యేలకు ఎర ఉదంతం నేపథ్యంలో ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉండవచ్చని తెరాస వర్గాలు తెలిపాయి. సీఎం హాజరుకాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిని పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోదీని చివరిసారిగా కేసీఆర్ గత ఏడాది సెప్టెంబరు2న దిల్లీలో కలిశారు. ఆ తర్వాత ప్రధాని మోదీ మూడు దఫాలు హైదరాబాద్ పర్యటనకు వచ్చినా.. సీఎం దూరంగా ఉన్నారు. మరోవైపు రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని మంత్రి కేటీఆర్ తాజాగా తప్పుబట్టారు. స్థానికులకు ఉద్యోగాలపై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.