ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 29న కేంద్ర క్యాబినెట్ భేటీ..

వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా 2024లో ‘వోట్ ఆన్ బడ్జెట్’ సమావేశాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో తాజా సమావేశాల కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 29న కేంద్ర క్యాబినెట్ భేటీ అవుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ హాజరవుతారు. వీరిలో సహాయ మంత్రులు కూడా ఉంటారు. వీరికి రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మోదీ తగిన సూచనలు చేస్తారు. మోదీ ప్రభుత్వానికి ఈ బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైనవి. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ బడ్జెట్‌ సమావేశాలు బీజేపీకి కీలకం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు.