మణిపూర్ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ….

మణిపూర్ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. మహిళలపై అమానవీయ ఘటనకు పాల్పడటం బాధాకరమన్నారు. ఈ ఘటన భారతీయులు సిగ్గుపడేలా చేసిందన్నారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. ప్రజలకు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు ప్రధాని. మహిళల భద్రత విషయంలో రాజీపడేది లేదన్న ప్రధాని.. మహిళల భద్రత కోసం కఠిన చట్టాలు తీసుకొని రావాలన్నారు..మణిపూర్‌లో ఘర్షణలు చెలరేగిన ఒక రోజు తర్వాత మే 4న ఈ ఘటన జరిగింది. (Manipur Incident) వీడియోలో ఇద్దరు మహిళలను ఒక గుంపు నగ్నంగా ఊరేగించి, వేధింపులకు గురి చేసి, పొలంలోకి లాగి, అక్కడ వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఈ నేరంపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని మణిపూర్ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.హింసాకాండలో 120 మందికి పైగా మరణించారు. వేలాది మంది ఊళ్లు వదిలి వెళ్లి పోయారు. వేలాదిమంది సహాయ శిబిరాల్లో తల దాచుకున్నారు. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను మరింత పటిష్ఠం చేయాలని ప్రధాని మోదీ చెప్పారు. నేరస్తులను విడిచిపెట్టబోమని తాను దేశానికి హామీ ఇస్తున్నానని మోదీ పేర్కొన్నారు.