డీపీలు మారుద్దాం.. దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి_..!

సోషల్ మీడియా డీపీలు మారుద్దాం.. దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి_.

దిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు కేంద్రం హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ (Pm Narendra Modi) ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా తప్పకుండా తమ సామాజిక మాధ్యమాల (Social Media) డీపీగా (Display Photo) జాతీయ జెండా ( National Flag)ను పెట్టుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఉదయం తన ట్విటర్ (ప్రస్తుతం ఎక్స్) ఖాతాలో ట్వీట్ చేశారు. దేశం, మన మధ్య బంధాన్ని పెంచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని తెలిపారు.”స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో మనమంతా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా ఖాతాల డీపీలో జాతీయ జెండాను ఉంచుదాం. దేశానికి, మనకు మధ్య బంధాన్ని పెంపొందించే ఈ కార్యక్రమానికి మన వంతు మద్దతునిద్దాం”అని ప్రధాని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పౌరుల్లో దేశ భక్తిని బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరు జాతీయ జెండా పట్టుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని శుక్రవారం మోదీ విజ్ఞప్తి చేశారు.