*భారతీయుడు చంద్రుడిపై కాలుమోపేందుకు శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించాలి : ప్రధాని మోడీ*
2040 నాటికి భారతీయుడు చంద్రుడిపై కాలుమోపేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు సూచించారు. మన సొంతంగా భారత అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేకునే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. భారత్ యొక్క గగన్‌యాన్ మిషన్ పురోగతిని అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల భవిష్యత్తు రూపురేఖల తయారీకి సంబంధించి చర్చించారు.