కఠిన నియమాలను ఆచరిస్తున్నా.. ప్రధాని మోడీ.

రామ మందిర ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం, శ్రీరాముల వారి విగ్రహాల ప్రాణ ప్రతిష్టకు సంబంధించి చారిత్రాత్మక సందర్భాన్ని కళ్ళారా చూడడానికి దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు..ఒకపక్క అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ముందు క్రతువులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

అయోధ్య రామ మందిర రామ విగ్రహాల ప్రతిష్టాపనకు 150 దేశాల నుంచి నాలుగు వేల మంది అతిథులు హాజరుకానున్నారు. వీరందరికీ ఆతిథ్యం ఇవ్వడానికి అయోధ్య సన్నద్ధమైంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నాడు, విగ్రహ ప్రతిష్టాపనకు పూజలో కూర్చునే 11 మంది దంపతులు పూజలో కూర్చోబోయే 11 మంది జంటలు ఇప్పటికే అనేక నియమాలను పాటిస్తున్నారు.

అత్యంత నిష్ఠతో వారు రామ దీక్షను ఆచరిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక జపాన్ని పాటిస్తున్నారు. ఆయన జనవరి 12వ తేదీ నుండి కఠిన నియమాలను ఆచరిస్తున్నారు. అనుష్టాన నియమాలను పాటిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి సిద్ధమవుతున్నారు..ఇక ఈ మేరకు ప్రధాని మోడీ అయోధ్య బలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం శుభపరిణామమని, ఆరోజు చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అవుతుందని పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నరేంద్ర మోడీ తన సమక్షంలో జరగడం భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చడానికి భగవంతుడు నన్ను పుట్టించినట్టు భావిస్తున్నానన్నారు..ఈ ఘట్టం తనను ఎంతో భావోద్వేగానికి గురి చేస్తోందని, జీవితంలో మొదటిసారి ఇటువంటి అనుభూతిని పొందుతున్నారని కఠినమైన అనుష్ఠాన నియమాలను అనుసరిస్తున్నానని పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట మహోత్సవం ప్రపంచం అంతటికీ పవిత్రమైన సందర్భం అని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి ప్రత్యేక బస్సులు, రైళ్ళు వేసి మరీ అయోధ్య రామ మందిరానికి ప్రజలను ఆహ్వానిస్తున్నారు. అత్యద్భుతంగా చరిత్రలో నిలిచిపోయేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుకను కన్నులపండుగగా నిర్వహించనున్నారు..