తొలిసారి ఓటర్ల ఛాయిస్ కూడా బీజేపీనే..
బీజేపీ పాలనా తీరుకు దక్కిన ఫలితం…
పేదరికాన్ని నిర్మూలించేదాకా వదలనన్న మోదీ..
ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి వచ్చిన ప్రధాని మోదీ.. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితం ప్రజాస్వామ్య విజయమని మోదీ వ్యాఖ్యానించారు. మహిళలు, యువత బీజేపీకి అండగా నిలిచారని కూడా మోదీ అన్నారు…
హిమాలయాల నుంచి గోవా వరకు బీజేపీకి మద్దతు లభించిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. యూపీ, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్లో బీజేపీకి ఆదరణ పెరిగిందని అన్నారు. తమపై నమ్మకం ఉంచిన మాతృమూర్తులకు, సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపారు. యూపీలో మొదటిసారి బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిందని.. గోవా ప్రజలు మాకు మూడోసారి అవకాశం ఇచ్చారని ప్రధాని మోదీ తెలిపారు. ఉత్తరాఖండ్లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చామని అన్నారు. గ్యాస్, విద్యుత్, నీరు, టెలిఫోన్ సౌకర్యాలు ప్రజంలదరికీ వచ్చాయని చెప్పారు. పేదలకు అందాల్సినవన్నీ హక్కుగా లభిస్తున్నాయని.. వారికి దక్కాల్సినవన్నీ దక్కేవారికి తాను విశ్రమించనని అన్నారు. బీజేపీ సుపరిపాలన వల్లే ఈ విజయం సాధ్యమైందని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ విజయంలో మహిళలు, యువతది కీలక పాత్ర అని కొనియాడారు….ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీ పాలనా తీరును మెచ్చి ప్రజలు ఇచ్చిన తీర్పు. పేదరికం నిర్మూలన అంటూ చాలా నినాదాలు, స్కీంలు వచ్చాయి. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. పేదరికాన్ని తొలగించేందుకు బీజేపీ చిత్తశుద్దితో పనిచేసింది. పేదలకు ప్రభుత్వ పథకాలు అందేవరకు నేను వదిలిపెట్టను” అని మోదీ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు….