గుల్జార్ హౌస్లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని
హైదరాబాద్ చార్మినార్ పరిధి గుల్జార్ హౌస్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
అగ్ని ప్రమాదంలో పలువురి మృతి కలచివేసిందన్నారు
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామని తెలిపిన ప్రధాని….
హైదరాబాద్లోని పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 17 మంది దుర్మరణం చెందగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు..
పాతబస్తీ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
మరణించిన వారి కుటుంబాలకు
తగు ఆర్థికసాయం చేసి అండగా నిలిచి.. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించి కాపాడాలని ప్రభుత్వాన్ని సూచించిన కేసీఆర్…