భారత్‌ను గొప్ప ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు మోదీ కృషి…ప్రముఖ అమెరికన్‌ గాయని మేరీ మిల్బెన్‌..

భారత్ కు ఆయనే మరోసారి ప్రధానిగా : అమెరికన్ సింగర్..

భారత్‌కు ప్రధాని మోదీ అత్యుత్తమ నాయకుడని, తమ దేశంతో సంబంధాలు బలపడటానికి ఆయనే ప్రధాన కారణమని ప్రముఖ అమెరికన్‌ గాయని మేరి మిల్బెన్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానిగా మోదీ మరోసారి ఎన్నికవ్వాలని చాలా మంది అమెరికన్లు కోరుకుంటున్నారని తెలిపారు. 2024 ఎన్నికలు ఇరు దేశాలకూ కీలకం. వీటి ఫలితాలు భారత్‌, అమెరికా సంబంధాలపై ప్రభావం చూపిస్తాయి. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే నాయకులను ఎన్నుకునే బాధ్యత మనదే. భారత్‌ను ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు మోదీ కృషి చేశారు. ఆయన ప్రభుత్వం ఆధ్వర్యంలో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో భారత్‌ పురోగతి సాధించింది. దేశాధ్యక్షురాలిగా, కేంద్ర మంత్రివర్గంలో మహిళలకు అవకాశం ఇచ్చి వారి నాయకత్వాన్ని ప్రోత్సహించారు…
భారత్‌కు ప్రధాని మోదీ అత్యుత్తమ నాయకుడని, తమ దేశంతో సంబంధాలు బలపడటానికి ఆయనే ప్రధాన కారణమని ప్రముఖ అమెరికన్‌ గాయని మేరీ మిల్బెన్‌ అన్నారు…ప్రధానిగా మోదీ మరోసారి ఎన్నికవ్వాలని చాలామంది అమెరికన్లు కోరుకుంటున్నారని తెలిపారు. ఆయన ఎన్నికతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయన్నారు. భారత్‌ను గొప్ప ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు మోదీ కృషి చేశారు. ఆయన ప్రభుత్వం ఆధ్వర్యంలో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో భారత్‌ పురోగతి సాధించింది.

రాష్ట్రపతిగా, కేంద్ర మంత్రులుగా మహిళలకు అవకాశం ఇచ్చి వారి నాయకత్వాన్ని మోదీ ప్రోత్సహించారు. భారత్‌లో ఆయనకు పోటీ లేదు. ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు ఆయన మరోసారి ప్రధానిగా ఎన్నికవుతారన్న నమ్మకం ఉంది” అని మిల్బెన్‌ తెలిపారు. గతేడాది జూన్‌లో మోదీ అమెరికా పర్యటన సందర్భంగా మిల్బెన్‌ ‘జనగణమన’ ఆలపించారు..