సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన ప్రధాని మోడీ..

*బిజెపికి అవకాశం వస్తే*
*బిఆర్ఎస్ తిన్నదంతా కక్కిస్తా:ప్రధాని నరేంద్ర మోడీ..

కేసీఆర్ మీద సంచలన ఆరోపణలు చేసిన ప్రధాని మోడీ..

జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత ఎన్డీయేలో చేరుతానని కేసీఆర్ నా దగ్గరికి వచ్చాడు… కానీ నేను ఒప్పుకోలేదు.

తెలంగాణ సీఎంగా తాను రాజీనామా చేసి.. కేటీఆర్‌ను సీఎం చేస్తానని చెప్పాడు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని నన్ను కోరాడు.

కేటీఆర్ ఏమైనా యువరాజా? ఇది రాజరికం కాదు.. ప్రజాస్వామ్యం అని చెప్పాను.

ఆ తర్వాత కేసీఆర్ నా కళ్లలోకి చూసే ధైర్యం కూడా చేయలేదు. అప్పటి నుంచి కేసీఆర్ తనను కలవడం లేదు. అందుకే నేను తెలంగాణకు వచ్చినప్పుడల్లా.. కేసీఆర్ నన్ను కలిసే ధైర్యం చేయడం లేదు – నరేంద్ర మోడీ

ఎన్డీఏ లో చేరతానని సీఎం కేసీఆర్‌ వెంటపడ్డారు.. కానీ ఆ ప్రతిపాదనను తాను ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం నాడు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన జనగర్జన సభలో మోదీ మాట్లాడుతూ..GHMC ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఢిల్లీ వచ్చి కలిశారు.

తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి కేటీఆర్‌కు ఇస్తానని కేసీఆర్‌ చెప్పారు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కేసీఆర్‌ కోరారు. ఇది రాజరికం కాదు.. ప్రజాస్వామ్యమని కేసీఆర్‌తో చెప్పా. మీరేమైనా రాజులా అని నేను ప్రశ్నించా.

ప్రజలు ఆశీర్వదిస్తేనే పాలకులు అవుతారని చెప్పా. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోమని కేసీఆర్‌కు తేల్చి చెప్పా. నాటి నుంచి నా కళ్లలోకి చూడ్డానికి కూడా సీఎం కేసీఆర్ భయపడుతున్నాడు’’అని మోదీ హెచ్చరించారు..

*అవసరం తీరాక కేసీఆర్ ప్రవర్తన మారింది*

కేసీఆర్ గతంలో హైదరాబాద్ ఎన్నికలపుడు నాతో అప్యాయంగా ఉన్నాడు. ఆర్భాటంగా స్వాగతం పలికాడని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడేమైంది? మా అవసరం తీరాక ఆయన ప్రవర్తన మారిపోయింది. మా కార్యకర్తలను ఎన్ని రకాలుగా వేధించినా భయపడేది లేదు. తెలంగాణను ఓ కుటుంబం దోచుకుంటోంది. ఎంతో మంది బలిదానాలతోనే తెలంగాణ సాకారమైంది.

తెలంగాణ వచ్చాక ఒక కుటుంబమే బాగుపడింది. కేసీఆర్‌ పాలనలో అవినీతి పెరిగింది. కేసీఆర్‌, ఆయన కుమారుడు…ఆయన కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారు. కేంద్రం ఇచ్చిన నిధులనూ బీఆర్ఎస్ దోచుకుంటోంది. కుటుంబ పాలనకు ప్రజలు మరో అవకాశం ఇవ్వొద్దు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా దోపిడీ చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చి మద్దతు ఇచ్చింది

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల డబ్బుని కర్ణాటకలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది..

తెలంగాణను రక్షించాలంటే గుజరాతీల వల్లే అవుతుంది: నరేంద్ర మోడీ!

1948లో నిజాం నుండి తెలంగాణను విడిపించడానికి ఒక గుజరాతీగా వల్లభాయ్ పటేల్ వచ్చాడు

ఇప్పుడు తెలంగాణను కాపాడడానికి మరో గుజరాతీ బిడ్డగా నేను వచ్చాను!

ఉద్యోగాల్లో అసలైన యువతకు అవకాశం రావడం లేదు. నమ్మకం ఉంచి టి.బీజేపీకి అవకాశం ఇవ్వండి. బీఆర్ఎస్, దోచుకున్నదంతా కక్కిస్తా’’ అని మోదీ పేర్కొన్నారు.