ప్రధాని నరేంద్ర మోదీ , సీఎం కెసిఅర్ కుటుంబంపై విమర్శలు..

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తు చేసినా ప్రధాని నరేంద్ర మోదీ.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ కుమార్తెకు మేలు జరగాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని , మీ కుటుంబానికి మేలు జరగాలంటే బీజేపీకి ఓటేయాలని ప్రజలను కోరారు.

భోపాల్‌, జూన్ 27: కేసీఆర్‌ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ కూతురికి మేలు చేయాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయండి.. మీ కుటుంబం బాగుపడాలంటే బీజేపీకి ఓటేయాలన్నారు. కుటుంబ పార్టీలపై భోపాల్‌ సభలో మోదీ నిప్పులు చెరిగారు. భోపాల్‌లో బూత్‌ లెవెల్‌ కార్యకర్తల సమావేశంలో ప్రధాని మోదీ ఈ విమర్శలు చేశారు. విపక్షాలన్నీ కలిసి రూ.10 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాయని అన్నారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో “మేరా బూత్ సబ్సే శక్తి” కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. భోపాల్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తిచేసుకుందని, లక్షలాది మంది బిజెపి కార్యకర్తల కృషి ఇందులో భాగమైందని అన్నారు…

లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. కేసీఆర్‌, తన కూతురుకి మేలు చేయాలంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలన్నారు. మీరు.. మీ పిల్లలు బాగుపడాలంటే బీజేపీ ఓటు వేయాలంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కేంద్రం కవితకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విపక్షాలు విమర్శించాయి. ఎమ్మెల్సీ కవిత పేరుని చార్జ్‌షీట్లలో పలుమార్లు ప్రస్తావించినా.. ఇప్పటికీ అరెస్ట్ చేయడంలేదని ఆరోపణలు చేశారు..ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీల మధ్య ఎలాంటి సంబంధం లేదన్న సంకేతాలను జనాలకు చెప్పాలన్న ఉద్దేశంతోనే ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు..