తెలంగాణ పోచంపల్లి చీరలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు..మోదీ టూర్ లో అరుదైన గిఫ్ట్స్.!

తెలంగాణ పోచంపల్లి చీరలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. నల్లగొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో ప్రత్యేకంగా తయారుచేసే ఇక్కత్ సిల్క్ చీరలు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ది పొందాయి. చేతులతో రంగులు వేసి పురాతన మద్దతుల్లో ఈ చీరలను తయారుచేస్తారు. దీంతో ఈ ప్రాంతానికి ఇప్పటికే జియోగ్రాఫికల్ ఇండికేషన్‌ రాగా.. సిల్క్ సిటీగా కూడా పేరు తెచ్చుకుంది.
అయితే తాజాగా పోచంపల్లి ఇక్కత్ చీరకు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భార్య బ్రిగిట్టే మాక్రాన్‌ను ఈ చీరను ప్రధాని నరేంద్ర మోదీ బహుమతిగా ఇచ్చారు. కొద్దిరోజులుగా ఫ్రాన్స్‌లో మోదీ పర్యటిస్తున్నారు. అక్కడ వివిధ కంపెనీల ప్రతిధులతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. భారత్, ఫ్యాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన భార్యకు శాండల్‌వుడ్ బాక్స్‌లో పోచంపల్లి చీరను మోదీ గిఫ్ట్‌గా అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి.