ప్రధాని మోదీ మహానటుడు ముందుగా ఆయనకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి..మంత్రి కేటీఆర్.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఆయ‌న మ‌హాన‌టుడు అని.. ఆస్కార్‌ కు పంపితే అవార్డు వ‌చ్చేద‌ని మోదీని ఉద్దేశించి కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లా జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు..నిన్న గాక మొన్న మ‌న తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు వ‌చ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌కు ఆస్కార్ అవార్డు వ‌చ్చింది. మ‌న పాట‌కు అవార్డు వ‌చ్చింది. కానీ మ‌న దేశంలో అద్భుత‌మైన మ‌హాన‌టుడు ఒకాయ‌న ఉన్నాడు. ఆ మ‌హాన‌టుడిని కూడా పంపితే ఆయ‌న న‌ట‌న‌కు కూడా ఆస్కార్ అవార్డు త‌ప్ప‌కుండా వ‌చ్చేది. ఆ మ‌హాన‌టుడు ఎవ‌రో మీకు యాదికి ఉన్నాడా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించ‌గానే స‌భికుల నుంచి మోదీ అంటూ నినాదాలు వినిపించాయి.2014లో మోదీ ఎన్నో మాయ‌మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చిండు అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. దేశం మొత్తం సంప‌ద దోచి వాళ్ల దోస్తు ఖాతాలో వేస్తున్నాడు. వారి ద‌గ్గ‌ర చందా తీసుకోని ప్ర‌తిప‌క్ష పార్టీల మీద ప‌డుతున్నాడు. పార్టీల‌ను చీల్చి, ఎమ్మెల్యేల‌ను కొని, దేశాన్ని ఆగం చేయాలి. ఇక్క‌డికి వ‌చ్చిన అద్భుత‌మైన న‌ట‌న ప్ర‌దర్శించాలి. మ‌హాన‌టుడు అని ఉత్త‌గ‌నే అన‌లేదు. ఇలా నాట‌కాలు ఆడుతున్నందుకే మ‌హాన‌టుడు అని అన్నాను అని కేటీఆర్ తెలిపారు..