గాఢ నిద్రకు మోదీ మంచి చిట్కాలు…!!

పరీక్షా పే చర్చా’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి దిల్లీలోని భారత మండపంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పిల్లలకు ప్రధాని పలు సలహాలు, సూచనలు అందించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా మోదీ పలు సూచనలు సూచించారు. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి పెంచకూడదన్నారు. అలాగే పిల్లలను మరొకరితో పోల్చకూడదని సూచించారు. అది వారి భవిష్యత్తుకు హాని కలిగిస్తుందన్నారు. కొందరు పేరెంట్స్ వారి పిల్లల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ను తమ సొంత విజిటింగ్‌ కార్డ్‌గా భావిస్తారన్న మోదీ.. ఎవరినైనా కలిసినప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్లినప్పుడు వారి పిల్లల గురించి గొప్పగా చెబుతారు. అది కరెక్ట్‌ కాదని తల్లిదండ్రులకు సూచించారు.

అలాగే మోదీ చిన్నారులకు నిద్రకు సంబంధించి మంచి చిట్కాలను చెప్పారు. తాను గాఢ నిద్రలోకి జారుకోవడానికి ఎలాంటి సూచనలు పాటించాలో మోదీ కొన్ని సూచనలు చేశారు. తాను కేవలం 30 సెకండ్లలోనే నిద్రలోకి వెళ్తానికి ప్రధాని మోదీ తెలిపారు. 365 రోజులూ ఇలాగే జరుగుతుందని మోదీ చెప్పుకొచ్చారు. తాను పనిచేసే సమయంలో పనిచేస్తానని, నిద్రపోయే సమయంలో మాత్రమే నిద్రపోతానని తెలిపారు. గాఢమైన నిద్రకు తాను సమతుల ఆహారం తీసుకుంటానని తెఇలపారు. వయసును బట్టి సమతులాహారం తీసుకోవాలని, ఇది గాఢ నిద్రకు సహాయపడుతుందని సూచించారు.ఇక గాఢ నిద్రకు మోదీ సూచించిన మరో అంశం.. వ్యాయామం. అయితే వ్యాయామం అనగానే కుస్తీ తరహాలోని వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదని, తేలికపాటి వ్యాయామాలు కూడా గాఢ నిద్రకు సహాయపడతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గాఢ నిద్రతోనే మనిషికి సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందని మోదీ చెప్పుకొచ్చారు..