దేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు.

హోలీ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ‘అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలి’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు…ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.