హైదరాబాదులో నరేంద్ర మోడీని టెన్షన్ పెట్టిన యువతి..

*హైదరాబాదులో నరేంద్ర మోడీని టెన్షన్ పెట్టిన యువతి*

హైదరాబాద్..
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో శనివారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో ఓ యువతి ప్రధాని మోదీని టెన్షన్ పెట్టారు.

మోడీ ప్రసంగిస్తుండగా యువతి విద్యుత్ లైట్లు అమర్చి ఉన్న స్తంభం పైకెక్కి యువతి హల్ చల్ చేశారు. స్థంభంపై నుంచి ఆ యువతి చేతులతో ఏదో చెబుతున్నట్లు కనిపించింది.

దీంతో ప్రధాని మోదీ యువతిని కిందికి దిగాలని కోరారు. నేను నీవు చెప్పేంది వింటాను అని అన్నారు. నీవు స్థంభం పైకెక్కడం మంచి పద్ధతి కాదు అని అన్నారు.

దయచేసి కిందికి దిగి రావాలని కోరారు.నేను మీ కోసమే ఇక్కడికి వచ్చాను’ అని అన్నారు.

మోదీ ప్రసంగిస్తుండగా యువతి స్తంభం పైకెక్కడంతో సభలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మోదీతోపాటు వేదికపై ఉన్న నేతలందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు..