ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్….

భారత ప్రభుత్వం చేపట్టింది. అయితే భారతీయ విద్యార్థులు రష్యా సరిహద్దు సమీపంలోని సుమీ పట్టణంలో ఉన్నారు. అక్కడి నుంచి రష్యా సరిహద్దుకు చేరుకోవడానికి రెండు గంటలు సమయం….

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను రష్యా మీదుగా తరలించేందుకు సహకరించాలని కోరారు. భారతీయ విద్యార్థుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదిలావుండగా, ఖర్కివ్‌ నుంచి భారతీయులు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటల్లోగా వెళ్ళిపోవాలని ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది. ఇక్కడి నుంచి పెసోచిన్, బాబే, బెజ్లిడోవ్కా నగరాలకు త్వరగా వెళ్లాలని ఆదేశించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు మరోసారి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. . ఈ భేటీలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల స్వదేశానికి వచ్చే అంశంపై చర్చించారు. నిజానికి, ఉక్రెయిన్‌లోని ఖార్కివ్(Kharkiv) నగరంపై రష్యా ఈరోజు వరుసగా రెండో రోజు బాంబు దాడి చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, భారతీయులను వీలైనంత త్వరగా ఖార్కివ్ వదిలి వెళ్లాలని భారత రాయబార(Indian Embassy) కార్యాలయం సలహా ఇచ్చింది. రైలు, బస్సు లేదా ఇతర వాహనాలు అందుబాటులో లేకుంటే, కాలినడకన పెసోచిన్, బాబాయే, బెజ్లియుడోవ్కాకు చేరుకోవాలని సూచించింది. ఖార్కివ్ నుండి పెసోచిన్ వరకు దూరం 11 కిలోమీటర్లు, బాబాయే నుండి దూరం 12 కిలోమీటర్లు, బెజ్లియుడోవ్కా నుండి దూరం 16 కిలోమీటర్లు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా చేరుకోవాలని భారత విదేశాంగ శాఖ కోరింది..భారతీయులకు 6 గంటల పాటు రష్యా వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9:30 గంటల వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం. ఉక్రెయిన్ నుంచి రష్యా మీదుగా భారత దేశానికి వెళ్ళేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి 9:30 గంటల తర్వాత ఖర్కివ్‌ను స్వాధీనం చేసుకునేందుకు చిట్టచివరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. .