ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఇదే….!

తెలంగాణా రాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో జాతీయ నేతలను రంగంలోకి దించి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చి బహిరంగ సభలో పాల్గొన్నారు.
క్రమంలోనే మోదీ ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఎంఆర్పీఎస్ నిర్వహించే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ఆయన హాజరుకానున్నారు. ఈ సభలో ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. వారం వ్యవధిలోనే ప్రధాని రెండోసారి హైదరాబాద్‌కు వస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఇదే..

సాయంత్రం నాలుగు గంటల 45 నిమిషాలకి ప్రధాని మోదీ బేంగంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు.
5 గంటలకు పరేడ్ మైదానంలో జరిగే మాదిగ ఉపకులాల విశ్వరూప మహా సభాస్థలికి చేరుకుంటారు.
5గంటల 45 నిమిషాల వరకు విశ్వరూప సభలో పాల్గొంటారు.
సభ అనంతరం ఆరు గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ దిల్లీకి తిరిగివెళ్తారు.