ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13న రాష్ట్రంలో పర్యటించనున్నారు…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
జనవరి 19న మోదీ తెలంగాణ పర్యటన తాత్కాలిక వాయిదా పడటంతో.. నిలిచిన పోయిన అభివృద్ది ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కార్యక్రమాలను ఫిబ్రవరి 13న పూర్తిచేయనున్నారు. అనంతరం ప్రధాని మోదీ సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనున్నారు…