ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌….

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి ఇరువురి నేతలు దాదాపు 35 నిమిషాలపాటు చర్చించారు. ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపునకు సహకరించినందుకు మోదీ ఆయనకు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. సుమీ నుంచి కూడా భారతీయుల తరలింపునకు సహకరించాలని కోరారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా మోదీ ఫోన్లో మాట్లాడనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.