దేశ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.. ప్రధాని నరేంద్ర మోడీ..

హానుమనుమాన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘బలం, ధైర్యం, సంయమనానికి ప్రతీక అయిన హనుమంతుని జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ప‌వ‌న్‌పుత్ర ద‌య‌తో ప్రతి ఒక్క‌రి జీవితాలు తెలివితేట‌లు, విజ్ఞానంతో నిండి ఉండాలి’ అని ప్రధాని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు..