ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం(PMEGP).
ముఖ్య ఉద్దేశం::- 18 సంవత్సరాల పైబడిన నిరుద్యోగ యువతకు సబ్సిడీ ద్వారా రుణములు అందించి ఉపాధి కల్పించడం.
విద్యార్హత::- ఎనిమిదవ తరగతి పాస్ అయిన వారు పది లక్షల పెట్టుబడి పైబడి ఉత్పత్తి తయారీ యూనిట్స్ కు మరియు ఐదు లక్షలు పెట్టుబడి పైబడి సర్వీసింగ్ యూనిట్ కు అర్హులు. 8వ తరగతి పాస్ కాని వారికి పది లక్షల వరకు ఉత్పత్తి తయారీ యూనిట్స్ కు ఐదు లక్షల వరకు సర్వీసింగ్ యూనిట్స్ కు అవకాశం.
అమలు చేస్తున్న సంస్థలు:*:- జిల్లా పరిశ్రమల కేంద్రం(DIC), ఖాది మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్(KVIC)., ఆంధ్రప్రదేశ్ ఖాది మరియు గ్రామీణ పరిశ్రమల మండలి(APKVIB), మరియు కాయర్ బోర్డు ద్వారా కొబ్బరి ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారు.
దరఖాస్తు చేయు విధానం::*- ఆన్లైన్ ద్వారా(www.kviconline.gov.in/pmegpeportal/)
*గమనిక::*- నూతనంగా స్థాపించిన యూనిట్స్ కు మాత్రమే సబ్సిడీ వర్తింపు.
సబ్సిడీ వివరములు::*-
జనరల్ కేటగిరి: పట్టణ ప్రాంతంలో 15% గ్రామీణ ప్రాంతంలో 25% 10 శాతం
ప్రత్యేక కేటగిరి*:(sc/st/obc/women/min/phc/ex -service):- పట్టణ ప్రాంతంలో 25 % గ్రామీణ ప్రాంతాల్లో 35 % లబ్ధిదారుని వాటా 5% శాతం…