ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద పలు విడతల్లో గర్భిణీలకు 11వేల ఆర్థిక సాయంం..

కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. వారి ఆర్థిక అభివృద్ధి కోసం వివిధ రకాల పథకాలను కేంద్రం ప్రారంభించింది. అలానే మహిళల ఆరోగ్యం కోసం కూడా పలు పథకాలను తీసుకొచ్చింది. అలాంటి వాటిల్లో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనే పథకం ఒకటి. ఈ పథకం మహిళా, శిశువు అభివృద్ధి శాఖ ద్వారా మహిళల కోసం నిర్వహించబడింది. ఈ స్కీమ్ కింద దేశంలోని ప్రతి మహిళకు పలు రకాల ప్రయోజనాలను అందించనున్నారు. అయితే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద పలు విడతల్లో గర్భిణీలకు 11వేల ఆర్థిక సాయంం అందజేయనున్నారు. ఈ పథకం దేశంలోని అన్ని రాష్ట్రంలో వర్తిస్తుందని తెలుస్తోంది. మరి ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. చిన్న పిల్లల దగ్గరి నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు చాలా పథకాలు అమలు చేస్తోంది. అలానే గర్భిణీ మహిళలకు కూడా కేంద్రం పలు స్కీమ్స్ ను ప్రారంభించింది. అలాంటి వాటిల్లో ఒకటే పీఎం మాతృత్వ వందన యోజన పథకం. దీనిని 2017లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇక ఈ పథకం ద్వారా దాదాపు మూడు విడతలలో 11 వేల ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు అందిస్తుంది. ఇక ఈ పథకం ద్వారా వచ్చే ఆర్థిక సాయంతో మహిళలు, వారి పిల్లలను పోషించగలరని కేంద్ర ప్రభుత్వం భావించింది. గర్భిణీ స్త్రీలకు ఉచిత మందులు, గర్భాదారణకు మందు మరియు వైద్య పరీక్షలు వంటి సౌకర్యాలు కూడా ఈ పథకం ద్వారా డబ్బులను అందిస్తున్నారు. అయితే ఈ పథకం పొందాలనుకునే వారు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పొందడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారత దేశానికి చెందిన వారై ఉండాలి. అదేవిధంగా గర్భిణీ మహిళ వయసు కచ్చితంగా 19 సంవత్సరాలు దాటి ఉండాలి. అదేవిధంగా గర్భిణీలు, బాలింతలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. దరఖాస్తు చేసుకున్న వారి యొక్క బ్యాంకు అకౌంట్ ఆధార్ కార్డుతో అనుసంధానం అయ్యి ఉండాలి. పీఎం మాతృత్వ వందన యోజన పథకానికి దరఖాస్తు చేయాలి అనుకునేవారు తప్పనిసరిగా కొన్ని ధ్రువ పత్రాలు కలిగి ఉండాలి. గర్భిణీ స్త్రీ ఆధార్ కార్డు , శిశు జనన ధ్రువీకరణ పత్రం, అడ్రెస్, పాన్ కార్డు, బ్యాంకు అకౌంట్ బుక్, ఫోన్ నెంబర్ , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో , ఆదాయ ధ్రువీకరణ పత్రం , కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.

ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అలా చేయాలనుకునే వారు ఈ పథకానికి సంబంధించిన అధికారకి వెబ్ సైట్ అయినా https://pmmvy.wcd.gov.inలోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేయాలి. అనంతరం అప్లయచ్ చేసిన వారికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఇక ఈ దరఖాస్తు ధృవీకరణ పూర్తైన తరువాత తర్వాత ఈ పథకం కింద మీరు పొందే ఆర్థిక సహాయం నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి వచ్చి చేరుతుంది. ఒక వేళ ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటే.. ఆ అవకాశం కూడా ఉంటుంది. ఇలా మూడు విడతల్లో 11వేల రూపాయలు గర్బిణీ స్త్రీల అకౌంట్లో పడతాయి. మొదటి కాన్పుకు ఐదు వేలను రెండు విడతల్లో ఇస్తారని తెలుస్తోంది. అలానే రెండో కాన్పుకు 6 వేలు ఇస్తారు. మొత్తంగా ఈ స్కీమ్ ద్వారా రూ.11వేల ఆర్థిక సాయాన్ని కేంద్రం ప్రభుత్వం అందిస్తుంది. మరి.. ఈ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.