ఈనెల 30 నుండి గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ…

*ఈనెల 30 నుండి గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ.

రాష్ట్రంలో ఈ నెల 30 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు…. ఇందుకు సంబంధించి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. జూన్ 30న అసిఫాబాద్(Asifabad) జిల్లా కేంద్రం నుండి పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. మంత్రులు(Ministers), ఎమ్మెల్యేలు(MLA) వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో(constituencies) అదే రోజు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నట్లు వెల్ల‌డించింది..
ఈ కార్యక్రమాన్ని *కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో అదేరోజున పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు.