రాష్ట్రంలో పోడు భూములపై విచారణ..

పోడు భూములపై హైకోర్టులో విచారణ.

R9TELUGUNEWS.COM రాష్ట్రంలో పోడు భూములపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వేలాది మంది ఆదివాసులను అడవి నుండివెల్ల గొట్టడాన్ని సవాలు చేస్తూ చెరుకు సుధాకర్, పిల్ విశ్వేశ్వర్ రావు, అదివాసి పోరాట సమితి నేత శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. పిటిషన్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ విచారించారు. పిటిషన్‌కు సంబంధించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు… తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది._