ఉక్రెయిన్‌కు పోలాండ్ అండగా నిలుస్తుంది.పోలాండ్ రాయబారి ఆడమ్…

రష్యా చేస్తూన్న దాడులను అనేక దేశాలు ఖండిస్తున్నాయి. తాజాగా పోలాండ్ మరియు ఇతర దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. EU మరియు ఇతర సంస్థలు రష్యాపై ఆంక్షలు విధించాయని భారతదేశంలోని పోలాండ్ రాయబారి ఆడమ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా చేసిన దూకుడు చర్య తమ పౌరులకు కూడా పెద్ద సమస్యను సృష్టించిందన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల నుంచి తప్పించుకున్న భారతీయులు, పోలాండ్‌లోకి వెళ్లేందుకు వారికి సహాయం చేస్తున్నామన్నారు. పోలాండ్ ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తోందన్నారు. రష్యా దురాక్రమణను ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఉక్రేనియన్లు తమ దేశం కోసం పోరాడుతున్న గొప్ప దేశభక్తులు అని ఆడమ్ కొనియాడారు. మరోవైపు పోలాండ్ వచ్చేనెల ఆడాల్సిన ఫుట్ బాల్ మ్యాచ్ ను కూడా రద్దు చేసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా పోలాండ్ 2022 ప్రపంచ కప్ ప్లే ఆఫ్ రష్యాతో మార్చి 24న మాస్కోలో ఆడదని పోలిష్ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు శనివారం పేర్కొన్నారు.