పోలీసులు ఆపార‌ని బైక్‌ను త‌గుల‌బెట్టిన వ్య‌క్తి…

హైద‌రాబాద్‌లోని మైత్రివ‌నం వ‌ద్ద ఓ ద్విచ‌క్ర వాహ‌న‌దారుడు హంగామా సృష్టించాడు. రాంగ్ రూట్‌లో వ‌చ్చిన ఆ వాహ‌న‌దారుడిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. పోలీసులు ఆపార‌ని త‌న బైక్‌ను తానే త‌గుల‌బెట్టాడు. బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్య‌క్తిని ఎల్లారెడ్డిగూడ‌కు చెందిన అశోక్‌గా పోలీసులు గుర్తించారు. దీంతో బైక్ పూర్తిగా కాలిపోయింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.