యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ కు….అభినందనల వెల్లువ…..!

యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ కు…. అభినందనల వెల్లువ…..!

హైదరాబాద్: రోడ్డుపై కుప్పకూలి పడిపోయిన ఓ యువకుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్ రాజశేఖర్‌ కు అభినందనలు వెల్లువెత్తున్నాయి.

యువకుడిని కానిస్టేబుల్‌ రక్షించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శభాష్.. రాజశేఖర్ అంటూ నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపించారు. ఇటు కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా అభినందలు తెలియజేశారు.

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని అభినందించి రివార్డు అందజేశారు. రాజశేఖర్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్ శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసనాయుడు రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి అభినందించారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలపై రాజశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు.