పోలీస్ స్టేషన్‌లో కోడి పంచాయితీ..!

పోలీస్ స్టేషన్‌లో కోడి పంచాయితీ..

*కోడిని కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ..

వృద్ధ మహిళ పెంచుకున్న కోడి కారణంగా గ్రామంలో పెద్ద రచ్చ జరిగింది. చివరకు ఈ కోడి గొడవ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది.! విచిత్రంగా ఉన్నా.. ఇది నిజమే. నకిరేకల్ మండలం గొల్లగూడెంకు చెందిన గంగమ్మ అనే వృద్ధురాలు తన ఇంట్లో కోడి పెంచుకుంటోంది. ప్రతిరోజూ ఆ కోడి బయటకు తిరిగి, సాయంత్రం ఇంటికి చేరేది. అయితే పక్కింటి రాకేష్ ఇంటి వద్ద గడ్డివాములో గింజలు తింటుందన్న కారణంతో, కోడిని కర్రతో కొట్టాడట…

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని గొల్లగూడెంలో తన గడ్డివాములో గింజలు తింటుందని, కర్రతో కొట్టి కోడి కాళ్లు విరగగొట్టిన రాకేష్ అనే వ్యక్తి

దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన గంగమ్మ

పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా, రాకేష్‌కు శిక్ష పడాల్సిందేనంటూ పట్టుబట్టిన గంగమ్మ